Abn logo
Sep 15 2021 @ 03:06AM

స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు !

రాబోయే పండగల సీజన్‌ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకి చేదు అనుభవం పంచబోతోంది. సెమీ కండక్టర్‌ చిప్‌లు సహా కీలక విడిభాగాల కొరత కారణంగా కొత్త స్మార్ట్‌ఫోన్ల విడుదల చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండకపోవడమే కాకుండా హ్యాండ్‌సెట్ల ధరలు కూడా 7 నుంచి 10 శాతం మేరకు పెరిగే ఆస్కారం ఉందని పరిశ్రమ నిపుణులంటున్నారు.  కనీసం రాబోయే రెండు త్రైమాసికాలు మొబైల్‌ ఫోన్ల పరిశ్రమను చిప్‌ల కొరత అల్లాడిస్తుందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ అన్నారు. ధరలు పెరిగినా పండగల సీజన్‌లో స్మార్ట్‌ ఫోన్లకు డిమాండు అధికంగానే ఉంటుందని ఆయన అంచనా వేశారు.