Abn logo
Mar 27 2020 @ 11:23AM

రీమేక్‌లో రానా?

పృథ్వీరాజ్‌, బిజూమీన‌న్ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌’ తెలుగు రీమేక్ హ‌క్కుల‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమా రీేమక్‌లో ఎవ‌రినీ న‌టింప చేస్తార‌నే దానిపై వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల నంద‌మూరి బాల‌కృష్ణ పేరు ప్ర‌ముఖంగా విన‌ప‌డింది. తాజాగా రానా ద‌గ్గుబాటి పేరు విన‌ప‌డుతుంది. త్వ‌ర‌లోనే ఇందులో న‌టించ‌బోయే న‌టీన‌టుల విష‌యంలో ఓ క్లారిటీ రావ‌చ్చున‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

Advertisement
Advertisement
Advertisement