Abn logo
Jun 2 2020 @ 13:16PM

ప్రభాస్ 20... టైటిల్ మారుతుందా..?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న 20వ చిత్ర‌మిది. ఇప్ప‌టి వ‌ర‌కు టైటిల్‌గానీ, ఫ‌స్ట్‌లుక్‌గానీ ఏ విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఈ సినిమా అప్‌డేట్ గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు జాన్ లేదా రాధేశ్యామ్ అనే పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయ‌ని వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. కానీ తాజాగా సోష‌ల్ మీడియా వ‌ర్గాల‌ స‌మాచారం మేర‌కు నిర్మాత‌లు ఇప్పుడు కొత్త టైటిల్ పెట్టాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొంత‌కాలం ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement