న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేపడుతున్న విషయం విదితమే. ఈ నేపద్యంలో జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని రైతు సంఘాల నేతలు మీడియా సమావేశంలో తెలిపారు. రైతులంతా ఆరోజు తమ ట్రాక్టర్లపై జాతీయ పతాకాన్ని పెట్టుకుని ర్యాలీ నిర్వహిస్తారన్నారు. ఇంతేకాదు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకూ రైతులెవరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోరని తెలిపారు. తాము ట్రాక్టర్లతో నిరరసన ర్యాలీ మాత్రమే నిర్వహిస్తామని, ఎవరికీ ఇబ్బందులు కలిగించమని తెలిపారు. ఈ సందర్భంగా 63 ఏళ్ల రైతు దబిందర్ సింగ్, మాట్లాడుతూ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకూ తాము గ్రామాలవెళ్లబోమని, అలాగే టీకాలు తీసుకోబోమని స్పష్టం చేశారు.