Abn logo
Dec 5 2020 @ 00:23AM

ఆ సినిమా పూర్తి చేస్తా

కొత్తగా  పార్టీ పెట్టి రాజకీయాల్లో చురుకైన పాత్ర వహించాలని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నిర్ణయించుకోవడంతో తమిళనాట రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుతం రజనీకాంత్‌ ‘అణ్ణాత్తే’ చిత్రంలో మాత్రమే నటిస్తున్నారు. వీలయినంత త్వరగా ఆ చిత్రాన్ని పూర్తి చేసి, ఇక రాజకీయాలకు అంకితం కావాలన్నది ఆయన ఆలోచన. ‘అణ్ణాత్తే’ సినిమాకు సంబంధించి ఇంకా 40 శాతం వర్క్‌ మిగిలి ఉంది. మొదట దాన్ని పూర్తి చేయాలి’ అని రజనీకాంత్‌ ఇటీవల  ఓ మీడియా సంస్థకు తెలిపారు. 


‘అణ్ణాత్తే’ షూటింగ్‌ గత ఏడాది డిసెంబర్‌ 18న ప్రారంభమైంది. కొవిడ్‌ -19 కారణంగా ఫిబ్రవరిలో షూటింగ్‌ ఆగిపోయింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా  కేంద్రప్రభుత్వం షూటింగ్స్‌ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వడంతో షూటింగ్‌ ప్రారంభించి, డిసెంబర్‌ కల్లా పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత భావించారు. అయితే రజనీకాంత్‌ వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కరోనా సమయంలో షూటింగ్‌ చేయడానికి నిర్మాత  కళానిధి మారన్‌ వెనుకాడారు. రజనీకాంత్‌ ఇప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో షూటింగ్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు శివ.

Advertisement
Advertisement
Advertisement