Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్త కుట్టిన ‘జాకెట్’ నచ్చలేదని భార్య ఆత్మహత్య

హైదరాబాద్ సిటీ/అంబర్‌పేట: క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కడప జిల్లాకు చెందిన శ్రీనివాస్‌, విజయలక్ష్మి(36) భార్యాభర్తలు. గోల్నాక తిరుమలనగర్‌లో పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్‌ దుస్తుల వ్యాపారం చేస్తూ టైలరింగ్‌ కూడా చేస్తాడు. శనివారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లగా శ్రీనివాస్‌ భార్యకు జాకెట్‌ కుట్టి ఇచ్చాడు. అది ఆమెకు నచ్చలేదు. అయితే నీకు నచ్చిన విధంగా కుట్టుకోమని ఇచ్చాడు. భర్తపై అలిగి ఇంట్లో బెడ్‌రూంలోకి వెళ్లి విజయలక్ష్మి గడియపెట్టుకుంది. భర్త ఎంత పిలిచినా తలుపు తీయలేదు. మధ్యాహ్నం పిల్లలు వచ్చి పిలిచినా తలుపుతీయలేదు. శ్రీనివాస్‌ తలుపులు పగుల గొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందింది. భర్త ఫిర్యాదు మేరకు అంబర్‌పేట ఎస్‌ఐ ఎస్‌.మల్లేశం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement