Abn logo
Oct 22 2021 @ 22:32PM

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు

తడ,  అక్టోబరు 22 : తన భార్య కనబడటం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్‌ఎంకండ్రిగ గ్రామానికి చెందిన పిల్లి రమణమ్మ (45) కుటుంబం ఆర్థిక అవసరాల కోసం చుట్టుపక్కల అప్పులు చేశారు. అయితే ఆ బాకీ తీర్చాలంటూ అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి చేయసాగారు. దాంతోపాటు కుమారుడు సైతం పనిచేయకపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. దీంతో రమణమ్మ ఈ నెల 18వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి భర్త, కుటుంబసభ్యులు వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.