Abn logo
Jul 13 2020 @ 17:15PM

`పుష్ప` నుంచి అందుకే తప్పుకున్నా: విజయ్ సేతుపతి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం `పుష్ప`. స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతిని తీసుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభమవడానికి ముందే ఆ సినిమా నుంచి విజయ్ తప్పుకున్నాడు. 


భారీ రెమ్యునరేషన్, ఇతర డిమాండ్ల వల్లే సినిమా నుంచి విజయ్‌ను తప్పించారని టాక్ వచ్చింది. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన విజయ్.. `పుష్ప` నుంచి తప్పుకోవడంపై వివరణ ఇచ్చాడు. `అవును.. నేను `పుష్ప` సినిమా చేయడం లేదు. నేను సుకుమార్‌గారిని వ్యక్తిగతంగా కలిసి నా కాల్ షీట్స్ సమస్య గురించి చెప్పాను. నేను ఆ సినిమా చేయాలనుకున్నాను. కానీ, డేట్ల సమస్య కారణంగా ఆ సినిమాను ఇబ్బందులకు గురి చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ముందుగానే సినిమా నుంచి తప్పుకున్నాన`ని విజయ్ సేతుపతి చెప్పాడు. 

Advertisement
Advertisement
Advertisement