Abn logo
Jun 3 2020 @ 21:46PM

ఆ పాత్ర‌లో న‌టించేదెవ‌రో?

ప్రముఖ వెయిట్‌లిఫ్టర్‌ కరణం మల్లేశ్వరి బయోపిక్‌ రూపొందించేందుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. సంజనారెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తెలుగు, తమిళం హిందీ భాషాల్లో ఒకే సమయంలో రూపొందనుంది. ఈ చ్రితంలో కరణం మల్లేశ్వరి పాత్రలో  నటించేందుకు ప్రముఖ హీరోయిన్‌ను న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆలోచిస్తున్నార‌ట‌. రీసెంట్‌గా క‌ర‌ణం మ‌ల్లేశ్వరిగా న‌టించ‌డానికి నిత్యామీనన్ నో చెప్పింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తాజాగా టైటిల్ పాత్ర‌లో నయనతార, త్రిష, అనుష్కలతో చిత్రనిర్మాతలు చర్చలు జరుపుతున్నారని వార్తలు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఈ ముగ్గురులో ఒక‌రైన ఓకే చెబుతారో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement