Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆఫ్రికా నుంచొచ్చే విమానాలపై నిషేధం విచారకరం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికా ఖండం నుంచి నేరుగా వచ్చే విమానాలను కొన్ని దేశాలు అనుమతించకపోవడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమని వ్యాఖ్యానించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ తొలి కేసు ఆఫ్రికా దేశం దక్షిణాఫ్రికాలో నమోదైన విషయం తెలిసిందే.  కాగా.. కొత్త వేరియంట్ విషయం దాచిపెట్టకుండా ప్రపంచానికి తెలియజేసినందుకు టెడ్రోస్ అథానమ్..బొత్సువానా, దక్షిణాఫ్రికా దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక తాజా లెక్కల ప్రకారం.. మొత్తం 30 దేశాల్లో ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. భారత్‌లో కూడా ఒమైక్రాన్ కేసులు బయటపడ్డ విషయం తెలిసిందే. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement