Abn logo
Feb 11 2020 @ 15:59PM

బీపి మాత్రలు రాత్రి సమయంలోనే మేలు!

ఇటీవ‌ల కాలంలో లో బీపీ లేదా హై బీపీ అంటూ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీన్ని తగ్గించుకోవ‌డానికి పలు రకాల మందులు  వాడుతుంటారు. అయితే బీపీ ఉన్నవారు రాత్రి సమయంలో మాత్రలు వేసుకుంటేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. సాధారణంగా బీపీ ఉన్నవారు ఉదయం లేవగానే మందులు వేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ పద్ధతి కన్నా రాత్రుళ్లు ఈ మాత్రలు వేసుకుంటేనే బీపీ అదుపులో ఉంటుందని స్పెయిన్ పరిశోధకులు అంటున్నారు. బీపీ మాత్రలను రాత్రి నిద్రపోయే ముందు వేసుకుంటే బీపీని అదుపులో ఉంచడమే కాకుండా గుండెపోటు లాంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం కూడా సగానికి తగ్గిందని పరిశోధకులు తేల్చి చెప్పారు. దాదాపు ఆరేళ్ల పాటు 19,000 మందిపై జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ వివరాలను వెల్లడించారు

Advertisement
Advertisement
Advertisement