Abn logo
Sep 25 2021 @ 13:44PM

ప్రియుడితో కలిసి హోటల్‌లో కనిపించిన చెల్లి.. పది నిమిషాల పాటు హైడ్రామా.. అసలేం జరిగిందంటే..

ఇంట్లో తెలియకుండా ఓ యువతి ప్రియుడ్ని కలవడానికి హోటల్‌కు వెళ్లింది. ఆమె ఎంత జాగ్రత్తపడినా చివరికి అన్నయ్య కంటపడి దొరికిపోయింది. చెల్లిని ప్రియుడితో చూసిన అతడు ఆగ్రహంతో ఊగిపోయాడు. పది నిమిషాల పాటు రోడ్డుపై గందరగోళం సృష్టించి, హైడ్రామా చేశాడు. ఆమెను జుట్టు పట్టుకొని ఇంటికి ఈడ్చుకెళ్లాడు. అసలేం జరిగిందంటే..


మధ్యప్రదేశ్‌లోని బార్దేహి ప్రాంతానికి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి హోటల్‌కు వెళ్లింది. అతడితో కలిసి ఉండగా ఆమెను సోదరుడు చూశాడు. ఇక అంతే.. ఆమెపై కోపంతో చెల్లి అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్లాడు. ఆ సమయంలో ఆమె ప్రియుడు కలగచేసుకుని విడిచిపెట్టమని బతిమాలినా అతడిని తోసేశాడు. ఆ యువతి అతడిని ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. తన ఫ్రెండ్‌తో కలిసి బైక్ మీద వచ్చి చెల్లిని ఇంటికి తీసుకుని వెళ్లిపోయాడు. 


అక్కడే ఉన్న ఓ వ్యక్తి పదినిమిషాల పాటు జరిగిన ఈ హైడ్రామాను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...