Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్తపై కోపం పెంచుకున్న భార్య.. ఉన్నట్టుండి భర్తకు అనారోగ్యం.. చివరకు ఆమె చేసిన పని తెలుసుకుని..

భర్తపై కోపాన్ని కొందరు వివిధ రకాలుగా చూపిస్తుంటారు. ఇంకొందరు కోపం వచ్చినా సర్దుకుని, యథావిదిగా సంసారం చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా.. భర్తపై కోపం పెంచుకుంది. ఎలాగైనా తన పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. కోపం చూపించడానికి ఎన్నో మార్గాలున్నా.. ఆమె తీసుకున్న నిర్ణయం మాత్రం.. సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఏ మహిళా.. కలలో కూడా చేయని పని చేసింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్న ఈ కేసు వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌‌కు చెందిన ఓ వ్యక్తికి 2015లో వివాహమైంది. ప్రస్తుతం ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది కిందటి వరకూ భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలూ లేవు. అంతా సంతోషంగా జీవించేవారు. ఆమెకు అత్తమామల నుంచి కూడా ఎలాంటి సమస్యలూ లేవు. వేరేవారు ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే.. సంతోషంగా కాపురం చేస్తారు. కానీ ఈమెకు మాత్రం పాడు బుద్ధి పుట్టింది. వేరు కాపురం పెడదామంటూ రోజూ భర్తను వేధించేది. అంతా కలిసి ఉందామంటూ భర్త ఎంత సర్దిచెప్పినా.. భార్య వినిపించుకునేది కాదు. పని చేసి అలసిపోయి వచ్చిన భర్తకు ఓదార్పు ఇవ్వకుండా.. వేరు కాపురం విషయమై రోజూ పోరు పెడుతుండేది. ఇలాంటి ఆలోచన మానుకోవాలని.. ఓ రోజు భర్త చాలా సీరియస్‌గా చెప్పాడు.

తన మాట వినలేదనే కారణంతో భర్తపై కోపం పెంచుకుంది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె పంతం నెరవేరలేదనే కసితో.. చివరకు ఏ భార్యా చేయరాని ఘోరం చేసింది. తన పీరియడ్స్‌కు సంబంధించిన రక్తాన్ని.. భర్త తినే ఆహారంలో కలుపుతూ వచ్చింది. ఇలా కొన్నాళ్లకు అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వైద్యులను సంప్రదిస్తే ఆహారం కల్తీ అవడం వల్లే ఇలా జరిగిందని చెప్పారు. భర్త, కుటుంబ సభ్యులు ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య కావాలనే ఆహారంలో రక్తం కలిపిందని, అలాగే ఆమె కుటుంబ సభ్యులతో కలిసి.. చేతబడి వంటివి చేశారని ఆరోపించారు. దీంతో భార్య, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేయడానికి నలుగురు సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement