Abn logo
Aug 24 2021 @ 12:38PM

విటమిన్‌ బి 12 ఎందుకు?

ఆంధ్రజ్యోతి (24-08-2021): శరీర జీవక్రియల్లో విటమిన్‌ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. దైనందిన జీవితంలోమనం ఎదుర్కొనే ఎక్కువ శాతం ఆరోగ్య సమస్యలకు ఈ విటమిన్‌ లోపమే కారణం. ఆరోగ్య పరిరక్షణలో విటమిన్‌ బి12 విధులు ఏవంటే...


శరీరంలోకి చేరిన పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడానికి విటమిన్‌ బి12 అవసరం. ఈ జీవక్రియ ఫలితంగా శక్తి పుంజుకుని, శరీరంలోని నిస్సత్తువ వదులుతుంది.


నాడీ వ్యవస్థ సక్రమ పనితీరుకు విటమిన్‌ బి12 అవసరం. ఈ విటమిన్‌ లోపం వల్ల మానసిక కుంగుబాటు, ఒత్తిడి, మెదడు క్షీణత మొదలైన సమస్యలు తలెత్తుతాయి.


ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు విటమిన్‌ బి12 అవసరం. కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచి, గుండెపోటు, అధిక రక్తపోటులకు గురి కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 


సరిపడా విటమిన్‌ బి12 ఉంటే ఆరోగ్యంగా ఉంటాయి. చర్మం, వెంట్రుకలు, గోళ్లు దక్కుతాయి. కణాల పునరుత్పత్తికి తోడ్పడే ఈ విటమిన్‌ కొత్త చర్మం తయారీకి కూడా అవసరం. 


రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్‌ కేన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంది.


దొరికే పదార్థాలు: పాలు, మాంసం, చేపలు, గుడ్లు, ఆకుకూరలు, తృణధాన్యాలు, కాలీఫ్లవర్‌, క్యాబేజీ మొదలైన ఆహారపదార్థాల్లో విటమిన్‌ బి12 పుష్కలంగా ఉంటుంది.

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

ప్రత్యేకంమరిన్ని...