Advertisement
Advertisement
Abn logo
Advertisement

gold medallist : నీరజ్ చోప్రాకు అస్వస్థత...కరోనా నెగిటివ్

పానీపట్ (హర్యానా): టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తీవ్ర జ్వరం కారణంగా తన గ్రామానికి సమీపంలో ఉన్న పానిపట్‌ నగరంలోని ఆసుపత్రిలో చేరారు. పానిపట్ సమీపంలోని ఖండ్రా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సన్మానానికి వచ్చిన చోప్రా అలసటతోపాటు తీవ్ర జ్వరంతో బాధపడుతూ వేదికను వదిలి వెళ్లి ఆసుపత్రిలో చేరారు. నీరజ్ చోప్రాకు తాజాగా కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని తేలింది. నీరజ్ సాధించిన బంగారు పతకాన్ని మందిరంలో ఉంచి పూజలు చేస్తామని నీరజ్ తల్లి సరోజ్ దేవి చెప్పారు. 

తీవ్ర జ్వరం కారణంగా గురు, శుక్రవారాల్లో పంజాబ్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన సన్మాన కార్యక్రమాలను వాయిదా వేశారు. నీరజ్ టోక్యో నుంచి తిరిగి స్వదేశానికి వచ్చాక ఒలింపిక్ బృందం కోసం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హోస్ట్ చేసిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్యదినోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నీరజ్ చోప్రా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో తేలడంతో జ్వరానికి చికిత్స పొందుతున్నారు. 


Advertisement
Advertisement