Abn logo
Oct 19 2021 @ 01:22AM

ప్రమోషన్‌ ఇవ్వకుంటే ఎలా?

నిరసన తెలుపుతున్న శంకరమ్మ

కాణిపాక ఆలయ ఈవో తీరు సరిగా లేదు

కళ్లకు గంతలతో నిరసన తెలిపిన ఉద్యోగిని


ఐరాల(కాణిపాకం), అక్టోబరు 18: ‘నా కు మాత్రమే ప్రమోషన్‌ ఇవ్వడం లేదు. ఈ విషయంలో ఈవో తీరు సరిగా లేదు’ అని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచే స్తున్న ఆరంజ్యోతి శంకరమ్మ ఆరోపిం చారు. ఈ మేరకు సోమవారం కళ్లకు గంతలు కట్టుకుని ఈవో కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఆమె మాట్లా డుతూ.. తనకు మూడేళ్ల కిందటే ప్రమోష న్‌ రావాల్సి ఉందన్నారు. దీనిపై ఈవోకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని చెప్పారు. ఉన్నతాధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు. 


నిబంధనల మేరకే పదోన్నతులు: ఈవో

నిబంధనల మేరకే పదోన్నతులు ఇస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశు స్పష్టం చేశారు. రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శంకరమ్మ ఆలయ ప్రతిష ్ఠకు భంగం కలిగేలా ఆందోళన చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. అ యినా మానవతా దృక్పథంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. ఉద్యోగుల అర్హతలను అనుసరించి పదోన్నతులు ఉంటాయన్నారు.