Advertisement
Advertisement
Abn logo
Advertisement

Hyderabadలో ఈ మెట్రో స్టేషన్‌కు పేరు పెట్టారు సరే.. అనౌన్స్‌మెంట్‌ ఏదీ..!?

హైదరాబాద్ సిటీ/జేఎన్‌టీయూ : మియాపూర్‌ టూ ఎల్‌బీనగర్‌ రూట్‌లోని కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద మెట్రోస్టేషన్‌కు డా. బీఆర్‌.అంబేడ్కర్‌ బాలానగర్‌ స్టేషన్‌గా నామకరణం చేసినా.. ఇప్పటికీ మైక్‌ అనౌన్స్‌మెంట్‌లో మాత్రం బాలానగర్‌ స్టేషన్‌గానే చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే డా.బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును చేర్చాలని ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైల్‌ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డికి జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆఫీసర్‌ డా.ఎ.బలరామ్‌ నాయక్‌ లేఖ రాసినట్లు వర్సిటీ పీఆర్వో ఉషాజినకరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఉన్న బాలానగర్‌ మెట్రోస్టేషన్‌ పేరును రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ బాలానగర్‌గా నామకరణం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని, దాన్ని బోర్డులో పేరుతో పాటు అనౌన్స్‌మెంట్‌లో కూడా చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement