Abn logo
Aug 2 2021 @ 00:47AM

ఉద్యాన రైతుకు ఊతమేది.?

రాంపురంలో సాగు చేస్తున్న చీనీ తోట


పండ్లు, కాయగూరల రైతులకు అందని సబ్సిడీ పథకాలు 

వీహెచ్‌ఏల నియామకంతో చేతులు దులుపుకున్న ప్రభుత్వం

వజ్రకరూరు, ఆగస్టు 1: మండల ఉద్యాన రైతులు ప్రభుత్వ సబ్సిడీలు, ప్రోత్సాహాలు అందక ఎదురు చూస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, పల్లె జీ వనానికి వెన్నెముక వ్యవసాయం. శ్రమ శక్తికి ఆధునిక పద్ధతులను మేళవించి వ్యవసాయ రంగంలో రైతులకు వెన్నుదన్నుగా నిలవడానికి ప్రభు త్వం ఉద్యానశాఖను ఏర్పాటు చేసింది. తద్వారా రైతులు పూలు, పండ్లు, కాయగూరలు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఆయిల్‌ ఫామ్స్‌ సాగుకు పోత్సహించడం ఆ శాఖ మొదటి లక్ష్యం. సాగుకు అవసరమైన విత్తనాన్ని సబ్సిడీతో అందించడం, వచ్చిన దిగుబడిని తరలించడానికి అవసరమైన ట్రేలను స మకూర్చడం, మార్కెట్‌కు తరలించడానికి సబ్సిడీతో వాహనాలను అందించాలి. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా నేటికి ఉద్యాన రైతులకు అవసరమైన ఎటువంటి సబ్సిడీ పథకాలను ప్రభుత్వం అందించలేదు. ఉద్యానానికి ఊతమిచ్చేలా రైతులకు ఫారంపాండ్స్‌ తవ్వించడం, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పంటలు సాగుకు వీలుగా పాలీహౌ్‌సలను ఏర్పా టు చేయడం, ద్రాక్ష, బీర, కాకర వంటి తీగజాతులకు శ్వాశత పందిళ్లు  వంటివి ఏర్పాటు చేయలేదు. మరికొంత కాలం ఇలాగే సాగితే ఉద్యాన పంటలు సాగు చేసే రైతాంగం తగ్గిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాలు ఉద్యానశాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అవసరమైన అన్ని పథకాలను అందించి ప్రోత్సహించేది. మండలంలోని వెంకటాంపల్లి, జరుట్లరాంపురం, రాంపురం కొట్టాల, కమలపాడు, కడమలకుంట గ్రామాల్లో విరివిరిగా రైతులు పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. ప ది రైతుభరోసా కేంద్రాలు ఉండగా, వీటిలో రెండింటిలో మాత్రమే వీహెచ్‌ఏలను నియమించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇప్పటివరకు రైతులకు ఎటువంటి శిక్షణ, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించలేదు. వ్యవసాయాన్ని పండుగలా చేస్తామని ఆర్భాటాలు చేస్తూ రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది. కరోనా ప్రభావతో నేలచూపులు చూస్తోన్న ఉద్యాన రైతులకు ఊతమివ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది.