Abn logo
Aug 2 2021 @ 00:22AM

ఐదేళ్ల సేవలకు సెలవ్‌..!

ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద మోకాళ్ళపై నిరసన తెలుపుతున్న తల్లి బిడ్డల ఎక్స్‌ప్రెస్‌ పైలెట్లు

జిల్లావ్యాప్తంగా ఆగిన తల్లీ బిడ్డల ఎక్స్‌ప్రెస్‌లు

రోడ్డున పడ్డ సిబ్బంది..

ఏలూరులో మోకాళ్లపై నిరసన

ఇప్పటి వరకు ఆసుపత్రుల నుంచి బాలింతలను సురక్షితంగా ఇళ్లకు చేర్చిన వాహనాలు

ఏలూరు క్రైం, ఆగస్టు 1 : ప్రభుత్వాసు పత్రిలో గర్భిణులకు పురుడు పోసిన తర్వాత తల్లీ బిడ్డలను సురక్షితంగా వారి ఇళ్లకు తీసుకుని వెళ్లడానికి విశేష సేవలం దిస్తున్న తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లకు బ్రేకులు పడ్డాయి. ఈ సేవలు పూర్తిగా నిలిచిపో వడంతో అందులో పనిచేస్తున్న సిబ్బంది ఆదివారం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మోకాళ్లపై నిరసన తెలిపారు. ప్రభుత్వాసుపత్రులలో ప్రసవం జరుపు కున్న సమయంలో కొంత మందికి సిజేరియన్‌ చేస్తున్నారు. వారు ఆటోల్లోనో, బస్సులో ప్రయాణం చేసినప్పుడు కుట్లు విడిపోయి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో.. అప్పటి సీఎం చంద్ర బాబునాయుడు 2016 జనవరి 1న ఏలూరు ప్రభుత్వాసు పత్రిలో తల్లీ బిడ్డల ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రారంభించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. జిల్లాలో 17 ఎక్స్‌ప్రెస్‌ వాహనా లుండగా వీటిలో నాలుగు ఏలూరు ప్రభుత్వాసు పత్రిలో ఉన్నాయి. జిల్లాలో ఆ వాహన డ్రైవర్లు(పైలెట్లు) 19 మంది ఉన్నారు. వీరికి నెలకు ఒకొక్కరికి రూ.7,143 జీతాన్ని జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ చెల్లిస్తోంది. ఐదేళ్ల కాంట్రాక్టు గత ఏడాది డిసెంబర్‌ 31తో ముగియడంతో మరో ఆరు నెలలు పొడిగిం చారు. అది కూడా జూన్‌ 30తో పూర్తికాగా, మరో మరో నెల రోజులు సేవలను కొనసాగించారు. వాహనాలను ఆగస్టు 1వ తే దీ నుంచి నిలిపివేస్తుండటంతో డ్రైవర్లను తొలగిస్తామని, వారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కో వాలని జూన్‌ 30నే జీవీకే సంస్థ నోటీసులు ఇచ్చింది. ఈ సంస్థకు ఎనిమిది నెలల నుంచి ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో సిబ్బందికి నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. 


 ఇక బాలింతలకు కష్టాలే

జిల్లాలో ఇప్పటి వరకూ తల్లీ బిడ్డల ఎక్స్‌ప్రెస్‌ సేవలు బాలింతలకు ఎంతో అద్భుతంగానే అందాయి. ఏనాడు వాహ నాల వల్ల ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇకపై గర్భిణులు ప్రభుత్వాసుపత్రులలో పురుడు పోసుకుంటే ఇంటికి చేరేవరకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఏ రోడ్లు చూసి నా గోతులమయంగానే ఉన్నాయి. ఆటోల్లో ప్రయాణించాలం టే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ప్రభుత్వాసుపత్రు లలో పురుడు పోసుకున్న బాలింతలు, సిజేరియన్‌ చేయించు కున్న బాలింతలు, వారి పసిబిడ్డలు ప్రయాణించాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. 


 సిబ్బంది నిరసన

ప్రభుత్వం రెన్యువల్‌ చేసి సిబ్బందిని యధావిధిగా కొనసా గిస్తుందని ఆశగా ఎదురుచూసినప్పటికీ ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఆదివారం ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద మోకాళ్లపై నిరసనతో ధర్నా చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఐదేళ్లుగా ఎలాంటి చెడ్డపేరు లేకుండా విధులు నిర్వర్తిస్తున్న తమను ఉద్యోగాల నుంచి తొలగించి నడిరోడ్డుపై నెట్టివేయడం ఎంత వరకూ భావ్యమంటూ ఎక్స్‌ ప్రెస్‌ సేవల డ్రైవర్లు వాపోయారు. తమ కుటుంబాలు వీధిన పడకుండా కాపాడాలని వారు కోరారు. పైలెట్లు సీహెచ్‌ రంగా రావు, కొల్లి శ్రీను, టి.రవి, ఎస్‌ఎన్‌ఎం ఫణి, ఎన్‌ సత్యనారా యణ, పి.అశోక్‌, ఎన్‌.నరేష్‌బాబు, బి.శివ పాల్గొన్నారు.