Advertisement
Advertisement
Abn logo
Advertisement

జాతీయ అథ్లెటిక్స్‌ మీట్‌కు క్రీడాకారులు ఎంపిక

ఏలూరు స్పోర్ట్స్‌, డిసెంబరు 2 : జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెలలో జరిగే జాతీయ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో పాల్గొనే జిల్లా జట్లకు సంబంధించి ఎంపిక పోటీలు గురువారం అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరిగాయి. పోటీలను స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సెంటర్‌ ఇన్‌చార్జి డి.వినా యక్‌ ప్రసాద్‌ ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడా కారులు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసినట్టు అసో సియేషన్‌ కార్యదర్శి ఆదిరెడ్డి సత్యనారాయణ తెలిపారు.

ఎంపికైన క్రీడాకారులు.. ఎస్‌.ఎస్‌.సాహుల్‌బాబు, జి.శ్యామ్‌సాయి నితిన్‌, కె.చరిత్‌, కె.సుబ్రహ్మణ్యం, డింపుల్‌ మహశ్రీ, జి.షారున్‌, వై.పూజిత, ఎం.డి.అమీ నా, జి.అబిసాయి, సి.హెచ్‌. శంకర్‌, ఎం.ఎస్‌.పి.రెడ్డి, టి.నాగబాబు, జి.విశాలాక్షి. 

Advertisement
Advertisement