Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెంకన్నకూ నకిలీ నోట్లు

కాళ్ళ, డిసెంబరు 2 : కాళ్ళకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థా నంలో 119 రోజులకు సంబంధించి గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో నకిలీ నోట్లు బయట పడ్డాయి. మొత్తం రూ.23,46,922 నగదు రాగా, ఇందులో రెండు వేల రూపాయల నకిలీ నోట్లు తొమ్మిది వచ్చినట్టు ఆలయ అధికారులు గుర్తించారు. ఆలయ ధర్మకర్తల మం డలి చైర్మన్‌ దండు వెంకటకృష్ణంరాజు, ఈవో ముదునూ రి సత్యనారాయణరాజు, యనమదుర్రు శక్తీశ్వరస్వామి దేవస్థానం ఈవో కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. గ్రామస్తు లు, భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement