Abn logo
Aug 2 2021 @ 00:09AM

ప్రమాదకరంగా డ్రెయినేజీ స్లాబ్‌

నవాబుపేట డ్రెయినేజీపై పగిలిన స్లాబ్‌

ఏలూరు కార్పొరేషన్‌, ఆగస్టు 1 : నగరంలోని నాల్గవ డివిజన్‌ నవాబు పేట నుంచి రామానగర్‌ కాలనీకి వెళ్లే రహదారిలో డ్రెయినేజీపై నిర్మించిన స్లాబ్‌ విరిగి ఊచలు బయటపడి ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. ఈ రోడ్డులో రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామని, డ్రెయినేజీ రోడ్డుపై గోతు లు పడి ఆరు నెలలైనా ఇప్పటివరకు అధికారులు పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని స్లాబుకు మర మ్మతులు నిర్వహించాలని కోరుతున్నారు.