Abn logo
Sep 25 2021 @ 00:01AM

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న స్కీం వర్కర్లు

కలెక్టరేట్‌ వద్ద స్కీం వర్కర్ల ధర్నా

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 24 : స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ శుక్రవారం నగరంలో స్కీం వర్కర్లు కదం తొక్కారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న స్కీం వర్కర్స్‌ ఒక రోజు సమ్మెలో భా గంగా విధులు బహిష్కరించి ఆర్‌ఆర్‌ పేట పార్కు వద్ద నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టి తమ నిరసన తెలి పారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు హైమా వతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు చింత కాయల బాబూరావు, జిల్లా అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడారు. వివిధ ప్రభుత్వ పథ కాలను అట్టడుగు స్థాయి ప్రజల వద్దకు తీసుకెళ్తున్న స్కీం వర్కర్లను ఉద్యో గులుగా గుర్తించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించి కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలని ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అమలు చేసి రిటైర్డ్‌ మెంట్‌ బెన్‌ఫిట్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌ వాడీ వర్కర్స్‌ యూని యన్‌ నాయకురాలు వెంకటలక్ష్మి, మెప్మా యూనియన్‌ నాయకురాలు వెంకట రమణ, కమల కుమారి, రమాదేవి, సీఐటీయూ నగర కార్యదర్శి పి.కిషోర్‌, మల్లి క, అరుణ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ అధికారి డేవిడ్‌రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. 

పెదవేగి : స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ నాయకుడు కొక్కిరిపాటి రవీంద్ర డిమాండ్‌ చేశారు. స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని స్కీం వర్కర్లు శుక్రవారం పెదవేగిలో ప్రద ర్శన చేసి, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దారు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ నాయకుడు రవీంద్ర మాట్లాడుతూ  స్కీమ్‌ వర్కర్లకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దారు సుందర్‌సింగ్‌కు అందించారు. సీఐటీయూ నాయకులు పి.ప్రసాద్‌, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పెదపాడు : అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లుగా విధులు నిర్వహిస్తున్న స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ పెదపాడులోని ఐసీడీ ఎస్‌ కార్యాలయం వద్ద సిబ్బంది శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు కోసం కష్టపడి పనిచేస్తున్న స్కీం వర్కర్ల సమస్యలు పట్టించుకోకపో వడం దారుణమన్నారు.  కార్యక్రమంలో సునీత, జ్యోతి, కుమారి, సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.