Abn logo
Oct 22 2021 @ 22:57PM

కలపర్రులో మహిళకు డెంగీ నిర్ధారణ

కలపర్రులో ఇంటి పరిసరాలను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

వైద్య సిబ్బంది అప్రమత్తం.. గ్రామంలో డీఎంహెచ్‌వో పర్యటన

పెదపాడు, అక్టోబరు 22 : మండలంలోని కలపర్రులో ఒక మహిళకు డెంగీ నిర్ధారణ అయింది. దీంతో వైద్య సిబ్బంది అప్రమత్తం అయింది. డీఎం హెచ్‌వో డాక్టరు బి.రవి గ్రామాన్ని శుక్రవారం సందర్శించారు. డెంగీ బాధిత మహిళకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. ఇంటి పరిసరా లను పరిశీలించారు. వైద్య సిబ్బందికి, పారిశుధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటుగా వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వద్దని, అనా రోగ్యానికి గురైతే తక్షణం వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.  ఆయన వెంట వైద్యులు భారతి, ఎంపీహెచ్‌ఈవో కృష్ణారావు, గోవిందరావు, ఈవో గోపి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.