Abn logo
Sep 21 2021 @ 23:28PM

10 మంది విద్యార్థులకు పాజిటివ్‌

రాచన్నగూడెం పాఠశాల వద్ద విద్యార్థులకు పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది

ఏలూరు ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 21 :  ప్రభుత్వ పాఠశాలల్లో మంగళ వారం ఒక్కరోజే పది మంది విద్యార్థులకు, ముగ్గురు టీచర్లకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జీలుగుమిల్లి మం డలం రాచన్న గూడెం ఎంపీయూపీ స్కూలులో ఏకంగా నలుగురు విద్యార్థులకు కరోనా సోకింది. రేలంగి జడ్పీ హైస్కూలులో ముగ్గురు, ఎ.గోకవరం ఎంపీయూపీ స్కూలులో ఇద్దరు, చాగల్లు అశోక్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో ఒక విద్యార్థికి కొవిడ్‌ నిర్ధారణ కాగా, పెద అమిరం మెయిన్‌, మేకల దిబ్బ, పడమటిపాలెం (తోలేరు) పాఠశాలల్లో ఒక్కొక్క టీచర్‌కు కరోనా సోకింది. జిల్లాలో ఇంతవరకు మొత్తం 220 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్‌ బారిన పడినట్టయింది.