Abn logo
Sep 25 2021 @ 00:07AM

ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన స్కూల్‌ బస్సు

ప్రమాదానికి గురైన బస్సు

జంగారెడ్డిగూడెం, సెప్టెం బరు 24 : స్కూల్‌ బస్సు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ఘటనలో విద్యార్థు లకు స్వల్ప గాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన వివ రాలు ఇలా ఉన్నాయి. జంగా రెడ్డిగూడెంలోని ఒక ప్రైవేట్‌ స్కూల్‌కు చెందిన బస్సులో విద్యార్థులను ఎక్కించుకుని వస్తుండగా మండలంలోని పుట్లగట్లగూడెం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో స్కూల్‌ బస్సు ముందు భాగం ధ్వంసం కాగా ఆర్టీసీ బస్సు వెనుక అద్దాలు పగిలిపోయాయి. ప్రమాద సమయంలో స్కూల్‌ బస్సులో 32 మంది విద్యార్థులు ఉండగా వారిలో 8 మంది విద్యార్థులకు, ఒక ప్రయాణికురాలు స్పల్ప గాయాల పాలయ్యారు. వీరిని జంగా రెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాఽథమిక చికిత్స అందించారు. ఈ ఘట నపై కేసు నమోదు చేసినట్టు లక్కవరం పోలీసులు తెలిపారు.