Abn logo
Aug 1 2021 @ 15:55PM

గోదావరిలో దూకి కుటుంబం ఆత్మహత్య

ప.గో. జిల్లా: ఆచంట దగ్గర విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామానికి చెందిన సతీష్ కుటుంబం చించినాడ బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ ఘటన జులై 30న జరిగితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సతీష్ అతని భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మృతదేహాల కోసం గోదావరిలో గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ఒక మృతదేహం లభ్యంకాగా మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.


కుటుంబ కలహాల నేపథ్యంలో ఇటీవల గల్ఫ్ నుంచి సతీష్ వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పశ్చిమగోదావరి ఆచంటలో ఉంటున్న భార్య, పిల్లలకు ఫోన్ చేసి శుక్రవారం రాత్రి చించినాడ బ్రిడ్జి వద్దకు రమ్మన్నాడు. ఆ తర్వాత సతీష్‌తో పాటు కుటుంబ సభ్యులు అదృశ్యం కావడంతో యలమంచిలి పోలీస్ స్టేషన్‌లో సతీస్ బంధువులు ఫిర్యాదు చేశారు. బ్రిడ్జి వద్ద సతీష్‌కు చెందిన బైక్‌ను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.