Abn logo
Jul 12 2020 @ 07:58AM

కరోనా బస్‌!

ఏలూరు: జిల్లాలో ఉచితంగా శ్వాబ్‌ నమూనాల సేకరణకు ప్రభుత్వం రెండు మొబైల్‌ వాహనాలను కేటాయించింది. ఈ వాహనాలు శనివారం జిల్లాకు చేరాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్‌ వాహనాలు తిరుగుతాయి. ప్రతి రోజు బస్సులో రెండు వందల మంది వరకూ టెస్ట్‌లు చేసేలా ఏర్పాటు చేశారు.నమూనాలను ప్రతి రోజు సాయంత్రం వైరాలజీ ల్యాబ్‌లకు పంపుతారు. ఈ ఫలితాల ఆధారంగా పాజిటివ్‌ బాధితులను చికిత్సలకు తరలిస్తారు. ట్రూనాట్‌ కిట్ల ద్వారా 24 గంటల్లో ఫలితాలు వెల్లడిస్తారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్‌ ముత్యాలరాజు పరిశీలించారు. 

Advertisement
Advertisement
Advertisement