Abn logo
Mar 6 2021 @ 12:02PM

పశ్చిమగోదావరి జిల్లాలో చిరుత సంచారం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం కొవ్వాడ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారాన్ని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. అడవిలోకి, పొలాల్లోకి ఎవరూ ఒంటరిగా వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు. చిరుత కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. నిన్న రాత్రి కొవ్వాడ వద్ద రెండు మేకలను చిరుత చంపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Advertisement
Advertisement
Advertisement