Abn logo
Sep 22 2020 @ 01:10AM

నూతన ఆవిష్కరణలకు..శ్రీకారం చుట్టాలి

ఘట్‌కేసర్‌ రూరల్‌: నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని అనురాగ్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ రామచంద్రం అన్నారు. వెంకటాపూర్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ కాంక్లెవ్‌ ఆన్‌ రీసెంట్‌ అడ్వాన్సెస్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌’ సదస్సులో ఆయన  మాట్లాడారు. పరిశ్రమలకు అవసరమయ్యే పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే విజయం సాధించగలుగుతామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకుసాగాలన్నారు. విద్యార్థులు అంతర్జాతీయ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సదస్సుకు దేశంలోని వివిధ యునివర్సిటీలతో పాటు ఆస్ర్టేలియా, అమెరికా, ఇంగ్లాడ్‌ దేశాల నుంచి 800 విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement