Abn logo
May 19 2020 @ 04:05AM

ప్రతీ కార్మికుడిని ఆదుకుంటాం : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ : ప్రతీ కార్మికుడిని ఆదుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కండ్లకోయ ఓఆర్‌ఆర్‌ వద్ద ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వలస కార్మికులకు భోజన పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొ న్నారు. ఈసందర్భంగా చిన్నపిల్లలకు, మహిళలకు చెప్పులు, ఎనర్జీఫుడ్‌ను అందజేశారు.


కార్మికుల ఆకలిని తీర్చడానికి ముందుకు వస్తున్న దాతలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు ఇంఛార్జ్‌ మర్రి రాజశేఖర్‌రెడ్డి, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు మద్దుల శ్రీనివాస్‌రెడ్డి, సీహెచ్‌ శేఖర్‌గౌడ్‌, జగన్‌రెడ్డి, నర్సింహ్మారెడ్డి, మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement