Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తాం

టీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీవీ మునిశేఖర్‌

కామారెడ్డి, డిసెంబరు 1: రాష్ట్రంలో టీఎస్‌ ఆర్ట్టీసీ ప్రయాణికుల కు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డెరెక్టర్‌ పీ.వీ మునిశేఖర్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 టీఎస్‌ ఆర్టీసీ రిజియన్‌లలో ఉన్న ఆర్టీసీ డిపోలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దాంట్లో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను తనిఖీ చేసినట్లు తెలిపారు. స్థానిక ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించనున్నట్లు తెలిపారు. టీఎస్‌ ఆర్టీసీకి శాశ్వత ఎండీని ప్రభుత్వం నియమించడంతో ఆర్టీసీ సమ స్యల పరిష్కారం కోసం నిత్యం ఎండీ కృషి చేస్తున్నాడని అన్నారు. ప్రతీరోజు రివ్యూలు నిర్వహిస్తూ ఆర్టీసీని నష్టాల్లోంచి గట్టెక్కించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన వసతులతో పాటు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాలనే ఉద్దేశ్యంతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ఆర్టీసీ చార్జీలను పెంచనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదం తెలిపిన తర్వాత ఆర్టీసీ చార్జీలను పెంచనున్నట్లు తెలిపారు. కరోనా వల్ల ఆర్టీసీకి తీవ్ర నష్టం జరిగిందని తెలిపారు. ఆర్టీసీ సంస్థ స్థితిగతులను తెలుసుకుని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎండీ ప్రతీరోజు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని అన్నారు. ఎండీ రాకముందు రోజుకు ఆర్టీసీకి రూ.3కోట్లు ఆదాయం రాగా.. నేడు రూ.11 నుంచి రూ.12 కోట్ల వరకు నిత్యం వస్తోందనానరు. సోమవారం రోజు రూ.13 కోట్ల ఆదాయం వస్తుందన్నా రు. ప్రతీరోజు రూ.13 కోట్ల ఆదాయం వచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రీజినల్‌ మేనేజర్‌లతో డిపో మేనేజర్‌లతో రివ్యూలు నిర్వహించి సమస్యలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఏడు నెలల కాలంలో ఆర్టీసీ రూ.1250 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. దానిని పూడ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో డీజిల్‌ లీటర్‌కు రూ.68 ఉండగా నేడు రూ.98 వస్తోందన్నారు. డీజిల్‌ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీ భారం పెరిగిందన్నారు. ఆదాయం పెరిగితేనే ఆర్టీసీ మనుగడ కొనసాగుతుందని తెలిపారు. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు తెచ్చే ఆలోచన చేయడం లేదని పాత బస్సులనే మరమ్మతులు చేసి కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. హెచ్‌హెచ్‌డీ, కేఎంపీఎల్‌ కిలో మీటర్‌కు రూ.18 ఖర్చు వస్తోందని దాన్ని తగ్గి ంచుకోవడం ఎలా అని స్థానిక అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లకు ప్రత్యేక శిక్ష ణ ఇస్తున్నామని తెలిపారు. పంచసూత్రాలు పా టించాలని చేయి చాపితే బస్సు ఆపాలని డ్రైవర్లకు సూచిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు మీద బస్సులు ఆప కుండా రోడ్డు పక్కన ఆపేలా కృషి చేయాలని డ్రైవర్లకు సూచిస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లు తప్పులు చేయ డం తగ్గిస్తే ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందన్నారు. చిన్న వాహనదారుడు వచ్చి బస్సుకు గుద్దినా గతంలో బస్సు డ్రైవర్‌పై కేసు నమోదయ్యేదని ప్రస్తుతం చిన్నవాహనం వచ్చి గుద్దినా బస్సు డ్రైవర్లపై కేసులు ఉండవని తెలిపారు. మహాత్మాగాంఽధి బస్‌స్టేషన్‌, జూబ్లి బస్‌స్టేషన్‌లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్‌ జిల్లాల్లోని బోధన్‌ బస్సు డిపోలను తనిఖీ చేసి ఆయా డిపోల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటానని తెలిపారు. గురువారం నిజామాబాద్‌ జిల్లాలోని డిపో 1, డిపో 2, ఆర్మూర్‌ డిపోను తనిఖీ చేసి సమస్యలను తెలుసుకోకున్నట్లు తెలిపారు. కామారెడ్డి ఆర్టీసీ డిపోలో మెకానిక్‌ గ్యారేజ్‌ని పరిశీలించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్‌లో వస్తువులు అధిక రేట్లకు అమ్ముతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. క్యాంటిన్‌, వాటర్‌ సమస్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కామారెడ్డి డిపో అధి కారులతో మాట్లాడారు. ఈ సమావేశంలో కామారెడ్డి, బాన్సువాడ, బోధన్‌ డిపో మేనేజర్‌లు ఆనంద్‌, సాయన్న, వెంకట్‌రమణ, సీఐలు లింగమూర్తి, దినేష్‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement