Abn logo
Sep 16 2021 @ 17:35PM

నిరుద్యోగుల తరపున పోరాడతాం: చంద్రబాబు

అమరావతి: నిరుద్యోగుల సమస్యలపై టీడీపీ పోరాటం చేస్తుందని మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట కమిటీ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని బాబుకు విన్నవించారు.


చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులను అన్ని విధాలా ఆదుకున్నామని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఒక బూటకమని విమర్శించారు. లక్షల ఉద్యోగాల ఇచ్చామని తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు తాము అన్ని విధాలా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండిImage Caption