Abn logo
Sep 28 2020 @ 04:40AM

ఉద్యమాన్ని నలుదిశలా విస్తరిస్తాం

Kaakateeya

285వ రోజు కొనసాగిన 

అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఉద్యమాన్ని రాష్ట్రంలోని నలుదిశలా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అమరావతి రైతులు, జేఏసీ నేతలు తెలిపారు. అమరావతిని కొనసాగించుకునేందుకు న్యాయపోరాటంతో పాటు ప్రజల మద్దతు కోసం 13 జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు చేస్తోన్న ఆందోళనలు ఆదివారానికి 285 రోజుకు చేరాయి. రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలను కొనసాగించారు.


కక్ష సాధింపులే వైసీపీ ప్రభుత్వ అజెండా: దేవినేని

ఎవరిపై ఏ కేసులు పెడదామన్న ఆలోచన తప్ప పరిపాలన, ప్రజా సంక్షేమంపై పాలకులకు దృష్టిలేదని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి దీక్షా శిబిరాల్లో రైతులకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని ఎవరు ఏ నిధులు ఎందుకు వెచ్చిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు. రాజధాని రైతులు పోరాటం అంతిమంగా నెగ్గుతుందని భోరోసానిచ్చారు. అమరావతి పరిక్షణ కోసం రైతలు మహిళలు నైతిక స్థైర్యంతో పోరాడుతున్నారని మహిళా జేఏసీ నేత డాక్టర్‌ రాయపాటి శైలజ అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement