Abn logo
Oct 25 2020 @ 16:50PM

మనీశ్ శుక్లా హత్యపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలి : బీజేపీ

Kaakateeya

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో బీజేపీ నేత, స్థానిక కౌన్సిలర్ మనీశ్ శుక్లా హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)కు అప్పగించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. ఈ హత్యకు బాధ్యత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)దేనని ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను టీఎంసీ తోసిపుచ్చింది. 


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, టీఎంసీ తన రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టే రాజకీయాలను ప్రారంభించడం సిగ్గు చేటు అన్నారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే మనీశ్ హత్య జరిగినందువల్ల స్థానిక పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు. ఈ హత్య కేసుపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలన్నారు. 


బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ మాట్లాడుతూ, మనీశ్ శుక్లా హత్యకు టీఎంసీదే బాధ్యత అన్నారు. ఆయనపై ఓ కార్బైన్ నుంచి కాల్పులు జరిపారని తెలిపారు. 


ఇదిలావుండగా, సీనియర్ టీఎంసీ నేత నిర్మల్ ఘోష్ మాట్లాడుతూ, మనీశ్ శుక్లా హత్యకు కారణం బీజేపీలో అంతర్గత కలహాలేనని ఆరోపించారు. తమ పార్టీపై ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు. 


మనీశ్ శుక్లాపై ఈ నెల 4 రాత్రి 9.30 గంటల ప్రాంతంలో  ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన శుక్లాను ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఉత్తర కోల్‌కతాకు 20 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ సంఘటన జరిగింది. ఆయన స్థానిక ప్రజలతో, బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. 


Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement