Abn logo
Jun 4 2020 @ 05:00AM

అసత్య ప్రచారాలు మానుకోవాలి

గూడూరు, జూన్‌ 3: ఎమ్మెల్యే వరప్రసాద్‌రావుపై అసత్య ప్రచారాలు మానుకోవాలని అళగనాథస్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ సిద్దారెడ్డి జనార్దన్‌రెడ్డి కోరారు. బుఽధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్‌గా ఉండాలని స్థానికులు తనను కోరడంతోనే ఎమ్మెల్యే తన పేరును ప్రతిపాదించారన్నారు. ఇందుకుగాను ఎమ్మెల్యేను తాము ప్రలోభపెట్టలేదన్నారు.  పార్టీ కోసం  క్రమశిక్షణతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి, భక్తవత్సలరెడ్డి, బత్తిని విజయ్‌కుమార్‌, మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి, కోడూరు మీరారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, బాలకృష్ణారెడ్డి, యమునమ్మ, సునీల్‌రెడ్డి, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement