Abn logo
Mar 26 2020 @ 00:59AM

మా ఇల్లు ఇస్తాం...

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో దేశంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు ఏ మేరకు సరిపోతాయో అన్న ఆందోళన ఉంది. కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు ప్రభుత్వం తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు మేము సైతం అంటూ పలువురు తారలు సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తన ఇంటిని కరోనా తాత్కాలిక ఆసుపత్రిగా మార్చేందుకు సిద్ధమని ప్రకటించారు.


ప్రభుత్వం అనుమతి ఇస్తే తన ఇంటిని ఆసుపత్రిగా మారుస్తామని కమల్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా, సీనియర్‌ నటుడు, దర్శకుడు పార్తిబన్‌ ఇదివరకే తన ఇంటిని కరోనా తాత్కాలిక ఆసుపత్రిగా మార్చేందుకు సిద్ధమని ప్రకటించారు. కమల్‌ కూడా ఆ ప్రకటన చేయడంతో.. ఇతరులు కూడా దీనిని అనుసరిస్తానని ఆశిస్తున్నట్లు పార్తిబన్‌ పేర్కొన్నారు.

 ఆంధ్రజ్యోతి, చెన్నై 

Advertisement
Advertisement
Advertisement