Abn logo
Mar 6 2021 @ 01:19AM

ఈ పని మేము చేయలేం.!

ఎంపీడీఓకు ఎండీయూ ఆపరేటర్ల వినతి 

నల్లమాడ, మార్చి 5: పనిఒత్తిడి వల్ల పనిచేయలేక పోతున్నామని మండలం మొ బైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌ (ఎండీయూ) ఆపరేటర్లు శుక్రవారం ఎంపీడీఓ ఆజాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ప్రతి గ్రామం లో ఇంటింటికి  రేషన ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సర్వర్‌ పనిచేయక ఇబ్బందులు పడుతున్నామన్నారు. డీలర్లు, వలంటీర్లు మాకు సహకరించడం లేదన్నారు. హెల్పర్‌గా పనిచేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. ఒక్క రోజు కూలీ రూ. 400 ఇవ్వాలని హెల్పర్లు డిమాండ్‌ చేస్తున్నారన్నారు. ప్రభు త్వ రేషన పంపిణీ వాహనానికి ప్రభుత్వం చెల్లించే రూ. 3 వేలు పెట్రోల్‌ ఖర్చులకు సరిపోవడం లేదని, అదనంగా రూ. 3 వేలు ఖర్చు అవుతోందన్నారు. అదేవిధంగా బియ్యం డీలర్ల వద్ద నుంచి వాహనంలోకి వేసుకోవాల్సి వస్తోందన్నారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ యూ ఆపరేటర్లు సురేష్‌, సుధాకర్‌, లక్ష్మీనారాయణ, ఇమ్రానబాషా, నరేంద్ర, వేమనారాయ ణ, రవీ, శివశంకర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement