Abn logo
Apr 6 2020 @ 05:47AM

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

మామడ, ఏప్రిల్‌ 5 : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అ న్నారు. ఆదివారం మండలంలోని పొన్కల్‌ గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రులు ప్రారంభించి మాట్లాడారు. రైతులకు టోకెన్లు ఇవ్వాలని, ఒకేసారి కేంద్రాలకు రా కుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలన్నారు. కేంద్రం వద్ద శానిటైజ ర్లు ఏర్పాటు చేయాలని, అత్యవసరమైతేనే ప్రజలు బయటకు వెళ్లాలని అన్నారు. కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం..

కరోనా వైరస్‌ను నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చర్యలు చేపడుతుందని మంత్రులు అన్నారు. రాయదారి గ్రామంలో రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు, వలస కూలీలకు రూ. 500 అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌, ఎస్పీ శశిధర్‌ రాజు, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, అదనపు కలెక్టర్‌ భాస్కర్‌ రావు, డీసీవో మురళీధర్‌ రావు, డీఎస్‌వో కిరణ్‌ కుమార్‌, ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌, డీసీసీబీ డైరెక్టర్‌ హరీష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement