Abn logo
Oct 25 2020 @ 17:00PM

మేం పిల్లలం కాదు: మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఓవైసీ

Kaakateeya

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ)పై ముస్లిం సోదరులను కొంత మంది తప్పు దారి పట్టిస్తున్నారంటూ ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. అబద్ధాలు అవాస్తవాలతో తప్పుదారి పట్టించడానికి తాము చిన్నపిల్లలం కాదని ఆయన తేల్చి చెప్పారు.


‘‘మేమేం చిన్నపిల్లలం కాదు, మమ్మల్ని తప్పుదారి పట్టించడానికి. సీఏఏ+ఎన్ఆర్‌సీ ఏం జరగబోతోందనే విషయాన్ని బీజేపీ నీళ్లు నమలలేదు. ఒకవేళ ఇది ముస్లింలకు సంబంధించింది కాకపోయి ఉంటే ఆ చట్టంలో మతానికి సంబంధించిన విషయాలను తొలగించండి. మేము భారతీయులమని నిరూపించే చట్టాలు వచ్చేంత వరకు మళ్లీ మళ్లీ నిరసనలు చేస్తూనే ఉంటాం’’ అని ఓవైసీ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.


అంతకు ముందు, దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ ‘‘సీఏఏ ప్రత్యేకంగా ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ, ముస్లిం జనాభాను నియంత్రించే చట్టమని తప్పుడు ప్రచారాలతో ముస్లిం సోదరులను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారు. దీని ఆధారంగా మరిన్ని నిరసనలు జరగొచ్చు’’ అని అన్నారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement