Abn logo
May 5 2020 @ 00:42AM

కల్లు తాగిన కరోనాని చూడబోతాం!

కరోనా విలయంతో ఆదాయాలు మందగించి పేదకుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం షాపులను తెరవటం అత్యంత అసంబద్ధమైన నిర్ణయం! లాక్‌డౌన్‌ సమయంలో ఎందరో తండ్రులు అదివరకటి బాధ్యతారాహిత్యాన్ని వదుల్చుకుని ఇప్పుడిప్పుడే బాధ్యతగా మారుతున్నారు. తమ వ్యసనాన్ని వదుల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణ యం తీసుకున్నది. ఒక పక్క ఆదాయాలు లేవు, మరోపక్క వ్యసనానికి తలుపులు బార్లా తెరిచారు. వ్యసనపరులు ఇక మందుకోసం ఖర్చుపెట్టేది తమ పొదుపు నిల్వలనే. ఇప్పటికే పెరిగిందని చెబుతోన్న గృహహింస ద్విగుణీకృతమయ్యే అవకాశం ఉంది. మన పెద్దవాళ్ళు సామెతగా ‘‘కల్లు తాగిన కోతి’’ అంటూ ఉంటారు. తస్మాత్ జాగర్త!–ఇప్పుడు కల్లు తాగిన ‘కరోనా’ మహమ్మారిని చూడబోతున్నాం. ప్రభుత్వం తన యీ నిర్ణయా న్ని పునస్సమీక్షించుకోవాలని కోరుతున్నాం. 

ఆరిఫ్‌ షేక్‌

Advertisement
Advertisement
Advertisement