Advertisement
Advertisement
Abn logo
Advertisement

108 వాహనం ఢీకొని Waterworks Works employee మృతి

హైదరాబాద్/కవాడిగూడ: తెల్లవారుజామున ట్యాంక్‌బండ్‌పై రోడ్డు దాటుతున్న వాటర్‌వర్కు ఉద్యోగిని 108 అంబులెన్స్‌ డీకొట్టడంతో అక్కడిక క్కడే మృతిచెందాడు. ఈ  ఘటన గాంధీనగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ట్యాంక్‌బండ్‌పై తానిషా విగ్రహం వద్ద మంగళవారం ఉదయం జరిగింది. గాంధీనగర్‌ ఎస్‌ఐ బాలకృష్ణగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... మెహదీపట్నం హుమాయున్‌నగర్‌ వాటర్‌వర్క్సు కార్యలయంలో పనిచేసే కావలి రాజశేఖర్‌ (54)  లంగర్‌హౌ్‌సలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున  ట్యాంక్‌బండ్‌కు వచ్చిన రాజశేఖర్‌ తానిషా విగ్రహం వద్ద రోడ్డు దాటుతుండగా  అంబేద్కర్‌ విగ్రహం వైపునుంచి సికింద్రాబాద్‌వైపుకు వెళుతున్న  108 వాహనం రాజశేఖర్‌ను వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం 108 సిబ్బంది గాంధీ మార్చురికి తరలించి గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు కుమారుడు  అనిల్‌ గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పేట్‌బషీరబాద్‌కు చెందిన 108 వాహనం డ్రైవర్‌  సుభా్‌షపై పోలీసులు  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement