Abn logo
Sep 17 2021 @ 00:04AM

పొల్లూరు జలపాతంలో పడి వ్యక్తి మృతి

మోతుగూడెం, సెప్టెంబరు 16: చింతూరు మండలం మోతుగుడెం పరిధిలోని పొల్లూ రు జలపాతంలో ప్రమాదవశాత్తు జారిపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. విజయవాడకు చెం దిన ఎనిమిది మంది స్నేహితులు పొల్లూరు జలపాతాన్ని చూసేందుకు వచ్చారు. వారిలో తిరుమలశెట్టి సుబ్బారావు (35) ఫొటోలు తియ్యడానికి జలపాతం పైకి ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. స్థానికుల సహాయంతో సుబ్బారావును బయటకు తీసి ఏపీ జెన్‌కో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్‌ అరుణ్‌కిరణ్‌ పరీక్షించి అప్పటికే సుబ్బారావు మరణించినట్టు తెలిపారు. ఇతడు లలిత జ్యువెలర్స్‌లో పనిచేస్తున్నాడు.  మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.