Abn logo
Jul 11 2020 @ 16:24PM

ఎత్తిపోస్తున్నారు.. రెండు వారాలుగా జూరాలకు వస్తున్న వరద

ఆధారిత ఎత్తిపోతలకు వారం రోజులుగా నీటి విడుదల

పది రోజుల్లో ఆల్మట్టి నుంచి దిగువకు నీరిస్తారనే అంచనా

జూరాలలోనూ ఆశాజనంగా నీటి నిల్వలు

వరదలొస్తే వృథా కాకుండా ముందుచూపుతో ఎత్తిపోతలకు నీటి తరలింపు


మహబూబ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జూరాల ఆధారిత ఎత్తిపోతల పథ కాలకు నీటి పంపింగ్‌ మొదలైంది. కృష్ణానది పై తెలంగాణలో ఉన్న మొట్టమొదటి జూరా ల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి ప్రవా హం వస్తుండటం, ఆల్మట్టి, నారాయణపూ ర్‌ జలాశయాలకు కూడా ఇన్‌ఫ్లోలు వ స్తుండటంతో వరదవస్తుందనే నమ్మకం తో ఇరిగేషన్‌ అధికారులు ఈ ఎత్తిపో తల పథకాలకు పంపింగ్‌ మొదలు పె ట్టారు. గత శనివారం నెట్టెంపాడు పథ కానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి నీటిని విడుదల చేయగా, ఆదివారం భీమా-1 పథకానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. జూరాల ఆధారంగా ఉన్న ఈ పథకాలకు నీటిని విడుదల చేయడం ద్వారా ఎగువ నుంచి వచ్చే నీటిని వచ్చినట్లు ఉమ్మడి  పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలకు వినియోగిం చుకునేందుకు ఆస్కారముంటుందనే అంచనాతో ఇరిగేషన్‌ అధికారులు పంపింగ్‌ చేపట్టారు. 


ఆల్మట్టికి వరద రాకతో జూరాలలో పంపింగ్‌

జూరాల ప్రాజెక్టుకు ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టితో పాటు, నారాయణపూర్‌ జలాశయాలలో ఉన్న నీటి నిల్వలు, వస్తున్న వరద నీరు ఆశాజనకంగా ఉండటంతో త్వరలోనే దిగువకు నీరు వస్తుందనే అంచనా ఇరిగేషన్‌ అధికారుల్లో ఉన్నది. ఆల్మట్టి పూర్తిస్థాయి సామర్థ్యం 129.79 టీఎంసీలకు గాను ప్రస్తుతం 87.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గతేడాది కంటే ఇది 36 టీఎంసీలు అదనం. ఆ తర్వాత ఉ న్న నారాయణపూర్‌ జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 37.64 టీఎంసీలకు గాను, 37.37 టీఎంసీల నీరు నిల్వ ఉన్న ది. ఇక్కడ కూడా గతేడాది కంటే 5.90 టీఎంసీల నీరు అధి కంగా ఉన్నది. ప్రస్తుతం ఆల్మట్టికి 72,031 క్యూసెక్కుల వర ద వస్తోంది. ఇదే ప్రవాహం కొనసాగితే, మరో పది రోజుల్లో దిగువకు దాదాపు ఇదే రీతిలో నీటిని విడుదల చేసే అవకా శం ఉన్నది. జూరాలలో కూడా ఈ ఏడాది 9.66 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను ఇప్పటికే 7.87 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టానికి కేవలం 1.83 టీఎంసీల నీరు అవసరముండటం, వరద నీరు 4,423 క్యూ సెక్కుల మేర నమోదవుతుండటంతో ఇక్కడి ఎత్తిపోతల ప థకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. గతేడాది జూలై 29వ తేదీన ఈ ఎత్తిపోతల పథకాలకు పంపింగ్‌ మొదలైతే, ఈ ఏడాది జూలై 4వ తేదీనే పంపింగ్‌ మొదలుపెట్టడం శుభ సూచకమని ఆయకట్టు రైతులు సంబరపడుతున్నారు.

Advertisement
Advertisement