Abn logo
Sep 23 2020 @ 00:57AM

జలకళ

Kaakateeya

మత్తడి దూకుతున్న చెరువులు


చౌదరిగూడ :

 కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చౌదరిగూడ మండలంలోని పలు చెరువులు  మత్తడి దూకుతున్నాయి. గొలుసుకట్టు చెరువులు గత 15  ఏళ్లుగా ఎప్పుడూ నిండలేదు. ఈసారి కురిసిన వర్షాలకు అవి నిండడంతో ప్రజలు ఆనంద ం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో మొత్తం నాలుగు నోటిపైడ్‌ చెరువులు, ఐదు చిన్న చెరువులు, 15 కుంటలున్నాయి. మండలంలోని పలు చెరువులు నిండి అలుగు పారడంతో జలకళ సంతరించుకుంది.


మండలంలోని చేగిరెడ్డిఘణపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న పెద్దవాగు చిన్నవాగు కలిసి పారడంతో వారం రోజుల నుంచి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చేపలు పట్టుకోవడానికి తరలివస్తున్నారు.  అలాగే ఎదిర పెద్ద చెరువు నిండటంతో కాస్లాబాద్‌, ఎదిర, పీర్జాపూర్‌, ముష్టిపల్లి గ్రామాల రైతులు రాబోయే రెండు సంవత్సరాల వరకు పంటలు పండించేందుకు అనువుగా ఉంటుందని  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement