Abn logo
Jul 14 2020 @ 22:41PM

బ్రాడ్‌ను పక్కనబెట్టడం ఆశ్చర్యం కలిగించింది: హోల్డర్

లండన్: కరోనా మహమ్మారి కారణంగా అటకెక్కిన క్రికెట్ కార్యకలాపాలు ఇంగ్లండ్-విండీస్ టెస్ట్ సిరీస్‌తో మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్‌ను ఎంపిక చేయలేదు. ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు కొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. బ్రాడ్ లేకుండా బరిలోకి దిగిన ఇంగ్లండ్ తొలి టెస్టులో ఓటమిపాలైంది. ఈ క్రమంలో దీనిపై విండీస్ టెస్టు జట్టు కెప్టెన్ జేసన్ హోల్డర్ స్పందించాడు. ఇంగ్లండ్ జట్టులో బ్రాడ్ లేకపోవడం తనను కొంత ఆశ్చర్యపరిచిందని హోల్డర్ చెప్పాడు. ‘సొంతగడ్డపై బ్రాడ్ రికార్డు అద్భుతంగా ఉంది. అతన్ని ఆడించడం కోసం జోఫ్రా ఆర్చర్ లేదా మార్క్ వుడ్‌లో ఒకరిని పక్కన బెట్టేస్తారని భావించా’ అని హోల్డర్ చెప్పాడు.

Advertisement
Advertisement
Advertisement