Abn logo
May 26 2020 @ 03:21AM

వార్నర్‌.. ‘మైండ్‌బ్లాక్‌’!

హైదరాబాద్‌: మొన్న బుట్టబొమ్మ, రాములో రాములా పాటలకు డ్యాన్సులు చేసి.. నిన్న పోకిరి, బాహుబలి సినిమాల్లోని డైలాగులు పలికి అదరగొట్టిన ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. తాజాగా మహే్‌షబాబు సినిమా సరిలేరు నీకెవ్వరులోని ‘మైండ్‌బ్లాక్‌’ పాటకు టిక్‌టాక్‌ చేసి వారెవ్వా అనిపించాడు. అయితే, ఈసారి కాస్త భిన్నంగా.. మైండ్‌బ్లాక్‌ పాటలోని ‘వాడిని కొట్టమని డప్పు’ అనే పదాలకు టిక్‌టాక్‌ చేశాడు. ముందుగా బ్యాటింగ్‌ చేస్తున్నట్టు పోజిచ్చిన వార్నర్‌.. ఆ పదాలు ముగిసి మ్యూజిక్‌ రాగానే తాను మాయమైపోయేలా ఉన్న వీడియో చేశాడు. ‘ఇది నా షాడో బ్యాటింగ్‌.. ఇంట్లో భార్య, పిల్లలు ఉన్న విషయం మీరు విన్నారు కదా. మళ్లీ కలుద్దాం’ అని ఆ వీడియోకు క్యాప్షన్‌ కూడా చేర్చాడు. 

Advertisement
Advertisement
Advertisement