Abn logo
May 30 2020 @ 12:22PM

`మైండ్‌బ్లాక్` చేసిన డేవిడ్ వార్నర్!

తెలుగు సినిమా డైలాగులు చెబుతూ, తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యుడు డేవిడ్ వార్నర్. `అల వైకుంఠపురములో..` చిత్రంలోని `రాములో.. రాముల..`, `బుట్టబొమ్మ` పాటలకు వార్నర్ గతంలో చిందులేశాడు. 


తాజాగా సూపర్‌స్టార్ మహేష్ `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని `మైండ్‌బ్లాక్` పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. `51వ ప్రయత్నం.. మహేష్ `మైండ్‌బ్లాక్` పాటలోని మొదటి భాగం` అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 



Advertisement
Advertisement
Advertisement