Abn logo
Oct 22 2021 @ 22:30PM

అభివృద్ధే లక్ష్యం

నాయుడుపేట, అక్టోబరు 22 : గ్రామ పంచాయతీలలో వార్డు సభ్యులు అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సుధాకర్‌రావు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జరుగుతున్న వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఈ శిక్షణ తరగతుల్లో అధికారులు సూచించిన సూచనలను అభివృద్ధికి వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ అడిషనల్‌ కమిషనర్‌ ప్రసాద్‌, నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి, డీఎల్‌పీవో వెంకటరమణ, ఎంపీడీవో శివప్రసాద్‌, డీఆర్‌పీలు శ్రీనివాసులురెడ్డి, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.