Advertisement
Advertisement
Abn logo
Advertisement

Warangal: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి నామినేషన్

వరంగల్: స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సోమవారం  నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. 


ఎర్రబెల్లి మాట్లాడుతూ... ఎంపీటీసీల గౌరవ వేతనం పెంచామని... ఇంకా పెంచుతామని తెలిపారు. ఎంపీటీసీలకు నిధులు కేటాయిస్తామన్నారు. రెచ్చగొట్టే నేతలకు ఎంపీటీసీలు సరైన సమాధానం చెప్పాలన్నారు. పోచంపల్లి ఏకగ్రీవం అయ్యేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ...వరంగల్ జిల్లా అంటే కేసీఆర్‌కు అభిమానమన్నారు. అందుకే ఎక్కువ ఎమ్మెల్సీ స్థానాలు వరంగల్‌కు ఇచ్చారని తెలిపారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. పోచంపల్లిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కోరారు. 

Advertisement
Advertisement